అనుష్క శెట్టి (తులు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జుననటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
| Pet Name: | స్వీటి శెట్టి |
| Birth Date: | నవంబర్ 7 1981
మంగుళూరు, కర్ణాటక |
వ్యక్తిగత జీవితం
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. ఇటీవలే బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత భరత్ ఠాకూర్.
అరుంధతి
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.
అనూష్క నటించిన తెలుగు చిత్రాలు
- అరుంధతి (2009)
- సూపర్
- మహానంది
- డాన్
- లక్ష్యం
- విక్రమార్కుడు
- స్టాలిన్ (ప్రత్యేక నృత్యం)
- ఒక్క మగాడు
- స్వాగతం
- చింతకాయల రవి
| Year : 2005 |
| Super | Sasha | Telugu |
| Mahanandi | Nandini | Telugu |
| Year : 2006 |
| Vikramarkudu | Neeraja Goswami | Telugu |
| Stalin | -- | Telugu |
| Rendu | Jothy | Tamil |
| Astram | Anusha | Telugu |
| Year : 2007 | | |
| Lakshyam | Indu | Telugu |
| Don | Priya | Telugu |
| Year : 2008 | | |
| Okka Magadu | Bhavani | Telugu |
| Swagatham | Shailu | Telugu |
| Baladoor | Bhanumathi | Telugu |
| Souryam | Swetha | Telugu |
| Chintakayala Ravi | Sunitha | Telugu |
| King | -- | Telugu |
| 2009 | | |
| Arundhati | Arundhati,
Jejamma | Telugu |
| Billa | Maya | Telugu |
|
|
|
| Siruthai | | Tamil |
| Singam | | Tamil |
| Vettaikkaran | | Tamil |
| Valiban | | Tamil |
No comments:
Post a Comment